మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పక్కన ఎమ్మెల్సీ కోటిరెడ్డి
చేర్యాల(సిద్దిపేట): రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికే రోల్ మోడల్‌గా మారిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కరువు ప్రాంతాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. దేశ సంపదను దోచుకెళ్లిన అదానీపై కేసులు పెట్టకుండా సీఎం కేసీఆర్‌ను మానసికంగా కుంగదీసేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ పంపిన సందేశాన్ని కోటిరెడ్డి చదివి వినిపించారు. బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చేలా కార్యకర్తలు కష్టపడాలని అన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూడూరు బాలరాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెడుతల యెల్లారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ తాడెం రంజిత, నాయకులు ఉల్లెంగుల ఏకానందం, జింకల పర్వతాలు, సోషల్‌మీడియా మండల అధ్యక్షుడు తాటికొండ సదానందం, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి
చేర్యాలలో బీఆర్‌ఎస్‌ఆత్మీయ సమ్మేళనం


