జీవ జలమా.. విషమా? | - | Sakshi
Sakshi News home page

జీవ జలమా.. విషమా?

Nov 26 2026 12:21 PM | Updated on Nov 26 2026 12:21 PM

● మంజీరా నదిలో కాలుష్య కారకాలు ● సరఫ్‌పల్లి, వెండికోలు ప్రాంతాల్లో ఆందోళన ● మౌనం వహిస్తున్న అధికారులు

● మంజీరా నదిలో కాలుష్య కారకాలు ● సరఫ్‌పల్లి, వెండికోలు ప్రాంతాల్లో ఆందోళన ● మౌనం వహిస్తున్న అధికారులు

సంగారెడ్డి: జీవకోటికి ప్రాణధారమైన మంజీరాలో కాలుష్యం ఆందోళన కలిగిస్తోంది. నదిలోని నీటిపై తెల్లటి నురుగు పెద్దఎత్తున తేలుతూ కనిపిస్తుండటంతో పరిసర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం సరఫ్‌పల్లి, వెండికోలు ప్రాంతాల్లో నది పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. నదిలో నీరు పాల నురుగులా కనిపించడం, నీటి ఉపరితలంపై తెల్లటి పొరలు ఏర్పడటం పర్యావరణ పరిరక్షణపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ పరిస్థితికి పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు నీటి విడుదల, ఇతర కాలుష్య కారకాలు కారణమా అనే అంశంపై సంబంధిత అధికారులు సమగ్ర పరిశీలన చేపట్టాల్సిన అవసరం ఉంది. మంజీరా నది అనేక ప్రాంతాలకు తాగు, సాగునీటి అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. నదిలో కాలుష్యం పెరిగితే జలచరాలు, పర్యావరణ వ్యవస్థతో పాటు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

నీటి నమూనాలు సేకరించాలి

నది నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించాలని, కాలుష్యానికి కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. నదిని కాపాడేందుకు సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి, కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిచో జలచరాలకు, మానవాళికి పెద్ద ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదులను కలుషితం కాకుండా కాపాడటం భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన నీటిని అందించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవా లని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement