సింగూరు.. | - | Sakshi
Sakshi News home page

సింగూరు..

Jun 4 2026 7:27 AM | Updated on Jun 4 2026 7:27 AM

గుర్తొస్తే గుండెలు పగులుతున్నయ్‌

ధాన్యపు సిరులు

ఉవ్వెత్తున ఎగిసిపడిన

పలుగు తండా

నారాయణఖేడ్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో మండలంలోని పలుగుతండా ముందు వరుసలో నిలిచింది. చిన్న తండా అయినా వినూత్న కార్యక్రమాలతో రాష్ట్ర స్థాయి నాయకులను ఆకట్టుకుంది. రాష్ట్రంలో మహిళా జేఏసీ మొట్ట మొదటిసారిగా ఈ తండాలోనే ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించి తండావాసులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. అర్థనగ్న ప్రదర్శనలు, కేంద్ర, రాష్ట్ర నేతల ఫొటోలు పట్టుకొని ప్రదర్శనలు, మాక్‌పోలింగ్‌, నిరాహార దీక్షలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు. తండాకు చెందిన టోప్యానాయక్‌, చౌహాన్‌ మారుతి నాయక్‌, మోహన్‌సింగ్‌, కేతావత్‌ మారుతీనాయక్‌, రవీందర్‌నాయక్‌ జైలుకెళ్లారు. వృద్ధులైన టోప్యానాయక్‌ (90) రెండేళ్ల క్రితం మరణించారు. బస్సుల ధ్వంసం, తహసీల్దార్‌, ఎకై ్సజ్‌, సీడీపీవో, మిల్క్‌చిల్లింగ్‌ సెంటర్‌ కార్యాలయాలపై దాడి ఘటనలు జరగగా అందులో కేసులు నమోదై ఇటీవలి వరకు కోర్టుల చుట్టూ తిరిగారు.

పిల్లల భవిష్యత్తు కోసం..

రాష్ట్రం ఏర్పాటైతే చదువుకున్న పిల్లల భవిష్యత్తు మారుతుందని ఆలోచించాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం బాగుపడుతుంది. అందుకోసం తాము చదువుకోకున్నా తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, రాష్ట్ర ప్రజలకు దోపిడీ నుంచి విముక్తులవుతారని ఆందోళనల్లో పాల్గొన్నాం. 16 రోజులపాటు జోగిపేట జైలులో ఉన్నాను.

– జాదవ్‌ మారుతి నాయక్‌,

రైతు, పలుగుతండా

స్వరాష్ట్రంతోనే అభివృద్ధి

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతేనే అభివృద్ధి సాధ్యం. దోపిడీ, పీడన పోవాలంటే రాష్ట్ర ఏర్పాటే లక్ష్యమని రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన అన్ని పోరాటాల్లో ముందున్నాం. వినూత్న కార్యక్రమాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టి రాష్ట్ర నాయకులు దృష్టిలో పడ్డాం. ప్రతీ పిలుపును అందుకొని పోరాటం చేశాం. తెలంగాణ వస్తే వెనుకబడ్డ జిల్లాతో పాటు ఖేడ్‌ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించాం. అందుకు అనుగుణంగా జిల్లా అభివృద్ధి చెందింది. వారం పాటు జోగిపేట జైలులో ఉన్నాను.

– రవీందర్‌నాయక్‌, పలుగు తండా

ద్యమ సమయంలో తెలంగాణ రాదని మనస్తాపంతో ఉరివేసుకున్న కుమారుడు గుర్తుకొస్తే గుండెలు పగిలిపోతున్నవి. త్యాగంను గుర్తించిన ప్రభుత్వం రూ.10లక్షలిచ్చి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంది. దీంతో కుమారుడిని కోల్పోయిన లోటును తీర్చినా కన్న పేగుబంధం ప్రేమ మండుతూనే ఉంది.

– తెలంగాణ అమరవీరుడు లింగం తల్లి కిష్టవ్వ, బూర్గుపల్లి

తెలంగాణ వచ్చిన తర్వాత సింగూరు ప్రాజెక్టు ప్రాంత వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సింగూరు సాగునీటి కాల్వకు మోక్షం లభించడంతో ఈ ప్రాంతం పచ్చని మాగాణమై మెరిసింది. రైతులు పుట్ల కొద్ది ధాన్యాన్ని పండిస్తున్నారు. ఉమ్మడి రాష్టంలో బోరు బావుల కింద విడుతల వారీగా వచ్చే కరెంటుతో ఆరుతడి పంటలు పండించారు. స్వరాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని పుల్‌కల్‌, చౌటకూర్‌, అందోల్‌ మండలాల్లో 40 వేల ఎకరాల వరకు వరి పంటను పండిస్తున్నారు. ఈ మండలాల్లో సాగునీటి కాలువలను చెరువుల్లోకి మళ్లించడంతో అదనంగా 114 చెరువుల కింద ఆయకట్టులో ఏటా రెండు పంటలు వరి సాగు చేస్తున్నారు. దీంతో దశాబ్ద కాలంలో రైతులు ఆర్థిక పరిపుష్టి సాధించారు.

– పుల్‌కల్‌(అందోల్‌)

రైతుల దశ మార్చిన ప్రాజెక్టు

వేల ఎకరాలు మాగాణం

రెండు పంటలు పండిస్తున్న రైతులు

ఆరుతడి పంటలకు స్వస్తి

సింగూరు సాగునీటి కాలువ

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సింగూరు సాగునీటి కాలువలను నిర్మించారు. దీంతో 2016 నుంచి సింగూరు సాగునీటి కాలువల ద్వారా 40 వేల ఎకరాలకు, పలు చెరువుల్లోకి నీటిని మళ్లించారు. కాగా అందోల్‌ నియోజకవర్గంలో సుమారు 50 వేల ఎకరాల వరకు రెండు పంటలకు సాగునీరు అందించారు. సింగూరు సాగునీరు అందడంతో అప్పట్లో ఉపాధి కోసం పట్టణాలకు వెళ్లిన కూలీలు 600 కుటుంబాల వరకు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు.

నంగునూరు(సిద్దిపేట): తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచింది సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం. కేసీఆర్‌ సెంటిమెంట్‌ ఆలయం కోనాయపల్లి వేంకటేశ్వరాలయంలో నాటి టీఆర్‌ఎస్‌ పార్టీకి బీజం పడగా హైదరాబాద్‌లోని జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావ ప్రకటన వెలువడింది. ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ మండల ప్రజలు ఉద్యమానికి అండగా నిలిచారు. ధర్నాలు, రాస్తారోకోలు, రహదారుల దిగ్భందం, వంటావర్పు, దిష్టిబొమ్మల దహనం, బతుకమ్మ ఆటలతో ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. కేసీఆర్‌ ఆమరణ దీక్ష భగ్నంతో భగ్గుమన్న మండల ప్రజలు అధినేత పిలుపుతో పాలమాకులలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నారులు సైతం ఊరూరా తరలివచ్చి 1,144 రోజుల పాటు దీక్షలో కూర్చున్నారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటనతో దీక్షలు విరమించి సంబరాలు జరుపుకున్నారు.

పాలమాకులలో

1144వ రోజు దీక్షలో పాల్గొన్న మహిళలు

మాజీ మంత్రి హరీశ్‌రావు చొరవతో..

ఉద్యమంలో జైలుకెళ్లా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి, మలి ఉద్యమంలో పాల్గొని 45 రోజులు జైలుకెళ్లా. కేసీఆర్‌తోపాటు ఉద్యమ జేఏసీ పిలుపుతో పాలమాకులలో సుదీర్ఘ కాలంగా రిలే దీక్షలు చేపట్టాం. మహిళలతోపాటు అన్ని వర్గాల ప్రజలు పండుగలను సైతం పక్కన పెట్టి పాల్గొన్నారు. నాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రభుత్వం గుర్తించి అండగా నిలవాలి.

– సంగు పురేందర్‌, జేఏసీ మాజీ కన్వీనర్‌

Advertisement
 
Advertisement
Advertisement