జహీరాబాద్ టౌన్: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడిచేసి దుర్భాషలాడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ.రాజేందర్‌రెడ్డి కథనం ప్రకారం... చిరాగ్‌పల్లి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు చాకలి తుకారం, మన్నెం గణేశ్ మే 31న ధనసిరి గ్రామంలో బసవేశ్వర చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన ఆర్య రమేశ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్ల వద్దకు వెళ్లి అసభ్య పదజాలంతో దూషించాడు. కానిస్టేబుల్ బైక్ తాళాలు తీసుకొని గణేశ్‌ను తోయడంతో ఆయన కిందపడ్డాడు. మరో కానిస్టేబుల్ తుకారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం నిందితుడ్ని కోర్టులో రిమాండ్ చేశామని ఎస్‌ఐ తెలిపారు.


