మెదక్‌జోన్: బీజేపీకి అసలైన బలం నిబద్దత గల కార్యకర్తలేనని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పా టు చేసిన ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పార్టీ స్థాపన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షు డు మల్లేశంగౌడ్ మాట్లాడుతూ.. కలిసికట్టుగా ముందుకు సాగుదామని, క్షేత్రస్థాయి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రంజిత్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సుధాకర్‌రెడ్డి, నందారెడ్డి, నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు


