రేగోడ్(మెదక్): రేగోడ్ మోడల్ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికై నట్లు ఎంఈఓ గుర్నాథ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థినులు తూర్పు హర్షవర్ధిని, నిక్షితలను వారు అభినందించారు.
టేక్మాల్ మోడల్ స్కూల్ నుంచి ముగ్గురు..
టేక్మాల్(మెదక్): బాసర త్రిపుల్ ఐటీ మొదటి లిస్టులో మండల మోడల్ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు స్కూల్ ప్రిన్సిపాల్ సాయిలు శనివారం తెలిపారు. పదో తరగతిలో 572 మార్కులు సాధించిన సంకీర్తన, 565 మార్కులు సాధించిన కంకర ప్రవీణ్, అలేఖ్య ఎంపికై నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ సాయిలుతో పాటూ, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.


