చిలప్‌చెడ్(నర్సాపూర్): ధాన్యం లోడ్‌తో రైస్‌మిల్లుకు వెళ్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన మండలంలోని గంగారం గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండల పరిధిలోని ఫైజాబాద్ గ్రామానికి చెందిన రైతు రమేశ్ తాను పండించిన ధాన్యాన్ని, హత్నూర మండలం సిరిపుర గ్రామ శివారులో గల ఓ మిల్లుకు తరలిస్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. విద్యుత్ స్తంభం విరగడంతో మండలంలోని పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న విద్యుత్‌శాఖ సిబ్బంది మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించారు.


