నాకున్న ఐదెకరాల పొలంలో ప్రతి యేటా జనుము సాగు చేస్తా. ఈ సారి సైతం విత్తనాలను కొనుగోలు చేశా. జనుము వేసిన 40 నుంచి 45 రోజుల్లో పూత దశకు రాగానే నేలలో కలియదున్నుతా. తర్వాత వరి సాగు చేసేందుకు సులభంగా ఉండటంతో పాటు, రసాయన ఎరువులు తక్కువ మోతాదులో వినియోగిస్తా. కలుపు మొక్కలు సైతం తక్కువగానే ఉంటాయి. దిగుబడి గురించి ఎప్పుడు ఆలోచించలేదు.
– ప్రవీణ్, రైతు, అజ్జమర్రి
అవగాహన కల్పించాం
జీలుగు, జనుము విత్తనాల వల్ల కలిగే లాభాల గురించి జిల్లా వ్యాప్తంగా రైతులకు, వ్యవసాయాధికారులు అవగాహన కల్పించారు. ఈ రెండింటితో మంచి ప్రయోజనాలు ఉన్న, ఎక్కువ మంది రైతులు వాటిని సాగు చేయకుండా తమదైన శైలిలో నేరుగా ప్రధాన పంట సాగు చేస్తున్నారు. భవిష్యత్‌లో నేల సారవంతంగా ఉండాలంటే రసాయన ఎరువులు తగ్గించడంతో పాటు, వ్యవసాయానికి, పర్యావరణానికి మేలు చేసే జీలుగ, జనుము సాగు చేయాలి.
– దేవ్‌కుమార్, డీఏఓ


