రామాయంపేట(మెదక్): స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు శనివారం అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణానికి చెందిన ఎరుకల విజయకు నా అనేవారు ఎవరూ లేరు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కనే గుడిసె వేసుకొని జీవిస్తుంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం మృతి చెందింది. దీంతో మున్సిపల్ కౌన్సిలర్లు నాగరాజు, దేవుని రంజిత్, పుట్టి సందీప్, రవి నాయక్‌లు మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు చింతల యాదగిరి, డీసీసీ ప్రధాన కార్యదర్శి గణేశ్, స్వామి, యాదగిరి, విరాట్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
అనాథ మృతదేహానికి అంత్యక్రియలు


