కొమురవెల్లి(సిద్దిపేట): తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు, స్థానికులు వివరాల ప్రకారం... స్థానికంగా ఉంటున్న సార్ల సురేశ్, భార్య భానుప్రియతో ద్విచక్రవాహనంపై పని మీద బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో భోజనం చేద్దామని సురేశ్ ఇంటికి రాగా అప్పటికే ఇంటి తాళం పగులగొట్టి ఉంది. బీరువాలోని రూ.లక్షా50 నగదు, మూడున్నర తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలను దొంగలు అపరించారు. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.


