విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో గడ్డి కట్టలు దగ్ధం

May 29 2026 8:16 AM | Updated on May 29 2026 8:16 AM

అక్కన్నపేట(హుస్నాబాద్‌): విద్యుత్‌ తీగలు ఒకదానికితో ఒకటి తాకటం వల్ల చెలరేగిన మంటల్లో గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మండలంలోని కేశనాయక్‌తండా పరిధిలోని లచ్చానాయక్‌తండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన లావుడ్య తిరుపతికి చెందిన పొలంలో పశువుల కోసం సుమారు 300 గడ్డికట్టలను నిల్వచేసి వాటిపై కవర్‌ కప్పి ఉంచాడు. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు, పలువురు రైతుల సహాయంతో నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే సగానికిపైగా గడ్డికట్టలు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.15 వేల వరకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement