ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇన్‌స్ట్రాగామ్, ఫేస్ బుక్, వాట్సాప్, టెలీగ్రాం వంటి సోషల్ మీడియా వేదికగా నకిలీ షాపింగ్ ప్రకటనల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయన్నారు. సైబర్ నేరగాళ్లు బ్రాండెడ్ షూస్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గ్యాడ్జెట్లు, లగ్జరీ వస్తువులను భారీ డిస్కౌంట్లతో అందిస్తున్నట్లు యాడ్స్ రూపొందించి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఒకవేళ మోసాలకు గురైనట్లు తెలిస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసిగాని, నేషనల్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు.
చదువు ప్రతీ ఒక్కరి హక్కు
నారాయణఖేడ్: చదువు ప్రతీ ఒక్కరి హక్కు అని ఖేడ్ మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి తెలిపారు. ఖేడ్ మున్సిపల్ సమావేశ మందిరంలో వయోజన విద్యాశాఖ సౌజన్యంతో మున్సిపాలిటీని సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో బుధవారం ‘ఉల్లాస్ నవభారత్ సాక్షరతా’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వలంటీర్లకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిరక్షరాస్యత నిర్మూలన కోసం వలంటీర్లు సేవాభావంతో పనిచేస్తూ ఖేడ్ పట్టణాన్ని పూర్తి అక్షరాస్యత పట్టణంగా తీర్చిదిద్దేందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. సీఆర్పీలు మౌనిక, పద్మ శిక్షణనిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా వయోజన విద్య డిప్యూటీౖ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, మెప్మా టీఎంసీ అనిత తదితరులు పాల్గొన్నారు.
బాల్క సుమన్‌పై
చర్యలు తీసుకోవాలి
ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి
పటాన్‌చెరు టౌన్: రైతు సమస్యలపై ధర్నాలు చేస్తే ప్రజలు స్పందించడం లేదని, గుర్తింపు రావాలంటే కార్యాలయాలు తగలబెట్టాలని, రైల్వే పట్టాలు తొలగించాలని, పేల్చివేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై ఐఎన్‌టీయూసీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పటా్‌న్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు కలిగించే విధంగా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతీన్, పట్టణ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, కార్మిక నాయకులు రాజు, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మక్కల డబ్బులు ఖాతాల్లో జమ
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు


