లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Apr 29 2026 8:30 AM | Updated on Apr 29 2026 8:30 AM

పది మంది ప్రయాణికులకు గాయాలు

మెదక్‌జోన్‌/కొల్చారం: లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో పదిమంది ప్రయాణికులకు గాయాలవ్వగా, అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కొల్చారం మండలం అప్పాజిపల్లి వద్ద మెదక్‌–నర్సాపూర్‌ జాతీయరహదారిపై మంగళవారం చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై హైమద్‌ మైనొద్దీన్‌ వివరాల ప్రకారం... బోధన్‌ డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు జేబీఎస్‌ నుంచి వయా నర్సాపూర్‌ జాతీయరహదారి మీదుగా బోధన్‌ వెళ్తుంది. ఈ క్రమంలో కొల్చారం మండలం అప్పాజిపల్లి సమీపంలో గల మూతపడ్డ పెట్రోల్‌ పంపు వద్దకు రాగానే బస్సు... వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో 35 మంది ప్రయాణికులుండగా వారిలో 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మిగతా వారికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెదక్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

డ్రైవర్‌కు తీవ్రగాయాలు

ఈ ప్రమాదంలో బస్సుడ్రైవర్‌ సాంబయ్యకు కుడికాలు, ఎడమ వైపు పక్కటెముకలు విరిగాయి. బాన్సువాడకు చెందిన జాకీర్‌ అనే మరో ప్రయాణికుడికి తలకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా వారికి స్వల్పగాయాలు కాగా చికిత్స అందిస్తున్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): బైక్‌ అదుపుతప్పి ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... సూరారం గ్రామానికి చెందిన బక్కన అనిల్‌, దిడ్డికాడి వినీల్‌ బైక్‌పై గవ్వలపల్లికి వెల్లి పెట్రోల్‌ పోయించుకొని తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు అంబులెన్స్‌లో మెదక్‌ ఆస్పత్రికి తరలించారు.

జహీరాబాద్‌లో ఇద్దరికి..

జహీరాబాద్‌ టౌన్‌: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. టౌన్‌ ఎస్‌ఐ.వినయ్‌కుమార్‌ కథనం ప్రకారం... చెన్న బసప్ప కారును రెంట్‌కు తీసుకొని హైదరాబాద్‌ నుంచి కర్నాటక గుల్బర్గాకు వెళ్తున్నాడు. పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో ఇంద్రప్రస్థ వెంచర్‌ వద్ద ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ సడన్‌గా బ్రేక్‌ వేశాడు. దీంతో కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. కారులో ఉన్న బసప్పతో పాటు కారు డ్రైవర్‌ భీమయ్యకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బైక్‌ అదుపుతప్పి ఇద్దరికి..

Advertisement
 
Advertisement
Advertisement