నేడు అందోల్‌లో మంత్రి దామోదర పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు అందోల్‌లో మంత్రి దామోదర పర్యటన

Apr 18 2026 8:17 AM | Updated on Apr 18 2026 8:17 AM

సంగారెడ్డి: మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి మినీ హజ్‌హౌస్‌కు అదనపు నిధుల మంజూరు కానున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని చర్యలు ప్రారంభించింది. మినీ హజ్‌హౌస్‌కు అవసరమైన అదనపు నిధుల మంజూరు కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ వక్ఫ్‌ బోర్డు ప్రధాన కార్యనిర్వాహక అధికారికి ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో సంగారెడ్డి ప్రాంత ముస్లిం సోదరులకు మెరుగైన హజ్‌ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చింత ప్రభాకర్‌ చెబుతున్నారు.

జోగిపేట(అందోల్‌): అందోల్‌ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సుమారు రూ. 27 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన పలు భవనాలను ప్రారంభించడంతోపాటు, కొత్త ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం నియోజకవర్గ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

రాహుల్‌ పోరాటానికి

మద్దతుగా నిలవాలి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి..

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహిళా బిల్లుకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని, ఈ బిల్లులో ఉన్న లోపాలను సరిదిద్దాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో పోరాడుతున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో జరిగిన నిరసన కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడారు. బీజేపీ చేస్తున్న హిస్సా చోరీకి వ్యతిరేకంగా రాహుల్‌ చేస్తున్న పోరాటానికి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ మహిళా బిల్లును యూపీఏ ప్రభుత్వ హయాంలోనే సోనియాగాంధీ ప్రవేశపెట్టారని, ఈ బిల్లును తెచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేనని గుర్తు చేశారు. ఇష్టానుసారంగా డీలిమిటేషన్‌ చేస్తూ నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసినా బీజేపీకే ఓటు పడేలా బీజేపీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్‌ బిల్లులపై రాజకీయకుట్ర జరుగుతోందని రాహుల్‌గాంధీ పలు ప్రశ్నలు లేవనెత్తారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు తోపాజీఅనంత కిషన్‌, చేర్యాల ఆంజనేయులు, రాంరెడ్డి, కూనసంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తేనే

ఎస్‌ఐఆర్‌ సర్వే చేస్తాం

అందోలు తహసీల్దార్‌కు

బీఎల్‌ఓల స్పష్టీకరణ

జోగిపేట(అందోల్‌): 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న బీఆర్‌ఓల బిల్లులను చెల్లిస్తేనే జూన్‌లో ప్రారంభమయ్యే ఎస్‌ఐఆర్‌ సర్వే చేస్తామని అంగన్‌వాడీ ఉద్యోగులు స్పష్టం చేశారు. శుక్రవారం అందోల్‌ తహసీల్దార్‌ మధుకర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రభుత్వం తమతో వెట్టి చాకిరి చేయించుకుంటుంది తప్ప సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కులగణన చేసిన సర్వే డబ్బులు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిల్లులు ఇవ్వకుండా అదనపు భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంగారెడ్డి బల్దియా

కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక

సంగారెడ్డి: సంగారెడ్డి మున్సిపాలిటీ కో ఆప్షన్‌ అభ్యర్థులను శుక్రవారం ఎంపిక చేశారు. వీరిని టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి ఎంపిక చేసినట్లు సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జార్జ్‌ వెల్లడించారు. ఎంపికై న ముగ్గురిలో ఇద్దరు మాజీ కౌన్సిలర్లే ఉన్నారు. రాంనగర్‌ మాజీ కౌన్సిలర్‌ శివశంకర్‌(శివుడు), శివాజీనగర్‌ మాజీ కౌన్సిలర్‌ కల్వకుంట యశోద, మైనార్టీ నుంచి రిక్షా కాలనీకి చెందిన మహమ్మద్‌ సలాద్దీన్‌ పేర్లు ఖరారు చేసినట్లు తెలిపారు.

మినీ హజ్‌హౌస్‌కు నిధులు

Advertisement
 
Advertisement
Advertisement