జోగిపేట(అందోల్): జోగిపేట మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గొర్లకాడి వెంకటేశంకు రాష్ట్ర ఉత్తమ ఎలక్ట్రీషియన్‌గా అవార్డు లభించింది. మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్‌కుమార్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కార అవార్డును వెంకటేశం అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ..ఈ ఉత్తమ పురస్కార అవార్డుతో మరింత బాధ్యత పెరిగినట్లైందన్నారు. తాను చేస్తున్న సేవలను గుర్తించి అవార్డు అందించినందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, వైద్య కమిషనర్ అజయ్‌కుమార్‌కు, విధుల పట్ల ప్రోత్సహించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్యకు కృతజ్ఞతలు తెలిపారు.
భూకబ్జా నుంచి కాపాడాలి
నారాయణఖేడ్: మనూరు మండలం బెల్లాపూర్లో 161బీ జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ భూమిలో ఓ వర్గం వారు దుకాణాల కోసం షెడ్లను వేసి కబ్జా చేసినందున ప్రభుత్వ భూమిని కాపాడాలని సదరు గ్రామానికి చెందిన దళితులు బుధవారం ఖేడ్ సడ్ కలెక్టరు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఉమాహారతికి ఫిర్యాదు చేశారు. దళితులు వేసుకున్న షెడ్లను తొలగించి ఓవర్గం వారే షెడ్లను వేసుకుని కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కబ్జాలనుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.
యూరియా యాప్‌ను
తొలగించాలి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని రేజింతల్, కంబాలపల్లి గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు సంఘం గ్రామ నూతన కమిటీలు వేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రైతులు యూరియా కొనాలంటే ప్రభుత్వం పెట్టిన ఆన్‌లైన్ యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నా రు. రైతులకు నష్టం చేసే యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం ఎలా చేయాలో తెలవకపోవడంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
సురక్షిత ప్రసవాలు చేయాలి
మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్
నేడు జాబ్ మేళా
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం విశేశ్వర్ గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో పట్టణ సమీపంలోని మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారని చెప్పారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్ చదివి 25 ఏళ్ల లోపు యువతీయువకులు అర్హులన్నారు. విద్యార్హత, ఆధార్‌కార్డు జిరాక్స్ కాఫీలతో హాజరుకావాలని కోరారు.


