మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి

Apr 9 2026 9:23 AM | Updated on Apr 9 2026 9:23 AM

సంగారెడ్డి: వైద్యాధికారులు సిబ్బంది సమగ్ర ప్రణాళికతో పనిచేసి మాతాశిశు మరణాల రేటును జీరోకు తీసుకురావాలని కలెక్టర్‌ ప్రావీణ్య పేర్కొన్నారు. సురక్షిత ప్రసవాలు, తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్‌ వీక్‌ కార్యక్రమాల్లో భాగంగా మెడికల్‌ కళాశాల సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘‘సేఫ్‌ మదర్‌ డే’’కార్యక్రమం టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డితో కలసి కలెక్టర్‌ ప్రావీణ్య పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహి ంచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గర్భధారణ సమయంలో సమయానుకూల వైద్య పరీక్షలు, టీకాలు, పోషకాహారం ద్వారా తల్లి శిశువుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. కొత్తగా తల్లులైన మహిళలకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ ఆస్పత్రిస్థాయిలో ఆశా, ఏఎన్‌ఎంల ద్వారా మండల సమాఖ్య మహిళలకు తల్లీ బిడ్డల సురక్షితంపై వర్క్‌షాప్‌లు నిర్వహించి గర్భిణులకు సమగ్ర సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్మలారెడ్డి మాట్లాడుతూ... సురక్షిత మాతృత్వంతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా ‘సేఫ్‌ మదర్‌ హుడ్‌’పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వసంత్‌రావు, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.మురళీకృష్ణ, డీసీహెచ్‌ఎస్‌ డా.కవిత, ప్రోగ్రాం అధికారులు డా.నాగనిర్మల, డా.శశాంక్‌, డాక్టర్లు, వైద్యాధికారులు, గర్భిణీలు పాల్గొన్నారు.

‘సేఫ్‌ మదర్‌ డే’వర్క్‌ షాప్‌లో

కలెక్టర్‌ ప్రావీణ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement