ఉపాధ్యాయుడికి అవార్డు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడికి అవార్డు

Jan 24 2026 9:37 AM | Updated on Jan 24 2026 9:37 AM

ఉపాధ్

ఉపాధ్యాయుడికి అవార్డు

ఉపాధ్యాయుడికి అవార్డు సాఫ్ట్‌బాల్‌ పోటీలకు గురుకుల విద్యార్థులు ఫిట్స్‌తో స్పృహ కోల్పోయిన విద్యార్థిని దాడి ఘటనలో కేసు విద్యుత్‌షాక్‌తో బాలుడికి గాయాలు

పాపన్నపేట(మెదక్‌): సంగారెడ్డి జిల్లా కొల్లూరు లో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో మండల పరిధిలోని కొడుపాక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వెంకటరమణ అవా ర్డు అందుకున్నారు. ఆయన తయారు చేసిన పిరియాడిక్‌ ట్రెజర్‌ క్వెస్ట్‌ టీఎల్‌ఎం నమూనా తెలంగాణ రాష్ట్ర విభాగంలో ఉపాధ్యాయ నమూనాల్లో ప్రశంస పొంది ప్రథమ స్థానంలో నిలిచింది. ఈనెల 19 నుంచి 23 వరకు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమంలో వెంకట రమణకు అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. సదరు ఉపాధ్యాయుడ్ని తోటి టీచర్లు అభినందించారు.

నర్సాపూర్‌: జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారని స్థానిక అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్‌ బల్‌రాం శుక్రవారం తెలిపారు. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కాలేజీకి చెందిన గణేశ్‌, పవన్‌కుమార్‌, నందులాల్‌, సురేశ్‌రెడ్డి, నవీన్‌ పాల్గొని ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కాగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌ బల్‌రాంతో పాటు వైస్‌ ప్రిన్సిపాల్‌ బాలోజీ, పీడీ లక్ష్మన్‌ నాయక్‌ అభినందించారు.

ఆస్పత్రికి తరలించిన లెక్చరర్లు

కౌడిపల్లి(నర్సాపూర్‌): కళాశాలలో ఓ విద్యార్థినికి ఫిట్స్‌ వచ్చి కిందపడిపోయింది. స్పందించిన లెక్చరర్లు వెంటనే ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రమైన కౌడిపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా... స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్‌ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో పేరెంట్‌ టీచర్‌ సమావేశం నిర్వహించారు. సమావేశం హాలులోకి ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వస్తున్న క్రమంలో ఫిట్స్‌ రావ డంతో ఒక్కసారిగా కిందపడిపోయింది. గమనించిన లెక్చరర్లు ఆమెను వెంటనే కారులో స్థానిక ప్రభుత్వ సీహెచ్‌సీకి తరలించారు. కొద్దిసేపటికీ విద్యార్థిని కోలుకోగా విషయం తల్లిదండ్రులకు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు.

మనోహరాబాద్‌(తూప్రాన్‌): దాబాపై దాడి చేసిన ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ వివరాల ప్రకారం... మండల కేంద్రానికి చెందిన పలువురు కాళ్లకల్‌ శివారులోని క్లాసిక్‌ దాబాలో బిర్యాని తినడానికి వచ్చిన సమయంలో వివాదం చెలరేగింది. ఈ సంఘటనలో హోటల్‌లో ఫర్నిచర్‌, సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేశారు. దీంతో పలువురికి తీవ్రగాయాలు కావడంతో పాటు , ఆస్తినష్టం వాటిల్లింది. హోటల్‌ సిబ్బంది అక్బర్‌ ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

హుస్నాబాద్‌: పట్టణంలోని మేడిబావి వీధిలో కంసాని ప్రవీణ్‌ అనే బాలుడు విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. వీధిలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లలో చిక్కుకున్న గాలి పటాన్ని తీసేందుకు ప్రయత్ని ంచాడు. ఈ క్రమంలో గాలి పటం అందకపోవడంతో ఇనుప రాడ్‌తో తీస్తుండగా విద్యుత్‌ వైర్లకు రాడ్‌ తాకింది. ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో బా లుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థాని క ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.

ఉపాధ్యాయుడికి అవార్డు 
1
1/1

ఉపాధ్యాయుడికి అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement