జపాన్‌లో విద్యా కెరీర్‌పై అవగాహన
కార్యక్రమంలో జపాన్ సంస్థల ప్రతినిధులు, కాలేజీ సిబ్బంది
నర్సాపూర్ : భారతదేశం, జపాన్ దేశాల మధ్య భాష, సంస్కృతి, విద్యా కెరీర్ అవకాశాల ద్వారా సంబంధాలు బలోపేతం కాగలవని జపానీస్ భాషా సలహాదారు క్యోకో టకేమోటో పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బీవీరాజు ఇంజినీరింగ్ కాలేజీని జపాన్ దేశ విద్యా , సాంస్కృతిక బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కాలేజీలో సెంటర్ ఫర్ ఫారిన్ లాంగ్వేజెస్, విష్ణు జపాన్ ఔట్రీచ్ సెంటర్ , న్యూఢిల్లీలోని జపాన్ ఫౌండేషన్‌లు ఏర్పాటు చేసిన కనెక్ట్ జపాన్ 2026 కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రపంచ కెరీర్‌పై అవగాహన, భాషా విద్యా ప్రాముఖ్యతను విద్యార్థులకు, లెక్చరర్లకు వివరించారు. అనంతరం జపాన్ ఫౌండేషన్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఇష్మీత్ కౌర్ మాట్లాడుతూ జపాన్ కోర్సు, జపనీస్ భాష అభ్యాస వనరుల గూర్చి తెలిపారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సంజయ్‌దూబె , కాలేజీ డైరెక్టర్ లక్ష్మిప్రసాద్, వైపర్ కాలేజీ ప్రిన్సిపాల్ రమేశ్, కాలేజీ డీన్ రాజు, మేనేజర్ బాపిరాజు, ఏఓ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


