అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ బదిలీ

Dec 31 2025 9:50 AM | Updated on Dec 31 2025 9:50 AM

అదనపు కలెక్టర్‌  చంద్రశేఖర్‌ బదిలీ

అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ బదిలీ

అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ బదిలీ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) బి.చంద్రశేఖర్‌ బదిలీ అయ్యారు. ఆయన్ను నల్గొండ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రశేఖర్‌ 2023 జూలై 19న అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఆయన ఇక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా చంద్రశేఖర్‌కు బదిలీ అయింది. ఆయన స్థానంలో ప్రస్తుతానికి ఎవరినీ నియమించలేదు. ఒకటీ రెండు రోజుల్లో ఈ పోస్టులో మరో అధికారిని నియమించే అవకాశాలున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో.. ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తును కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీల పాలనను పర్యవేక్షించే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌లను బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement