సంగారెడ్డి జోన్: జిల్లాలో చేపట్టిన జాతీయ రహదారి 65 విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాతీయ రహదారి విస్తరణ, విద్యుత్, ట్రాఫిక్ పోలీస్‌శాఖ అధికారులతో రహదారి విస్తరణపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విస్తరణ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్నారు. విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ రఘునందన్‌రావు, జాతీయ రహదారి ఎస్‌ఈ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి: 11వ అంతర్ జిల్లా సీనియర్ బాస్కెట్‌బాల్ ముగింపు కార్యక్రమం పట్టణంలోని అంబేడ్కర్ మైదానంలో సోమవారం నిర్వహించారు. తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలారెడ్డి విజేతలకు టోఫ్రీని బహూకరించారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ జట్టు ప్రథమ స్థానం, రెండోస్థానంలో రంగారెడ్డి, ముడోస్థానంలో మేడ్చల్ జిల్లా జట్టు నిలిచింది. మహిళల విభాగంలో మొదటిస్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, రెండో స్థానంలో హైదరాబాద్, మూడోస్థానంలో రంగారెడ్డి జట్టు నిలిచింది. ఈసందర్భంగా నిర్మలారెడ్డి మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములు సహజం అని అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి ఆనంతకిషన్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్‌చెరు టౌన్: మండలంలోని భానూర్ పంచాయతీ పరిధిలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లను సోమవారం ఏడు మండలాలకు తరలించారు. నోడల్ ఆఫీసర్ అఖిలేష్, డీఎల్పీఓ అనిత ఆధ్వర్యంలో తరలించారు. ఈసందర్భంగా అఖిలేష్‌రెడ్డి మాట్లాడుతూ... గుమ్మడిదల, పటాన్‌చెరు, హత్నూర, సదాశివపేట, సంగారెడ్డి, కొండాపూర్, కంది మండలాలకు చెందిన 1,872 బాక్స్‌లను ఆయా మండలాలకు పంపనున్నట్లు తెలిపారు. వీటిలో 1,134 పెద్ద, 188 చిన్నబాక్స్‌లు ఉన్నాయి. చిన్నబాక్స్‌లో 75 ఓట్ల కంటే తక్కువ ఉన్న పోలింగ్‌స్టేషన్లకు పంపనున్నట్లు తెలిపారు.
పటాన్‌చెరు టౌన్: కుటుంబ నియంత్రణ పాటించాలని జిల్లా వైద్యాధికారి వసంత్‌రావు అన్నారు. సోమవారం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన వ్యాసెక్టమీ ఆపరేషన్ క్యాంప్‌ను ఆయన సందర్శించి మాట్లాడారు. కు టు ంబ నియంత్రణలో భాగంగా అర్హులైన పురుషులకు వ్యాసెక్టమీ ఆపరేషన్ గురించి అవగాహన కల్పించామన్నారు. తిరిగి శిబిరం 4వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. వ్యాసెక్టమీ చేయించుకుందాం అనుకునేవారు 3వ తే దీన ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం: సీఐటీయూ
జహీరాబాద్ టౌన్: ఐక్యతతోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. మండలంలోని బూచినెల్లి పారిశ్రామిక వాడలో గల సీఐఈ పరిశ్రమలో సోమవారం వేతన ఒప్పదం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం సీఐటీయూతోనే సాధ్యమన్నారు. కార్మికుల పక్షాన ఉంటూ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. 4 లేబర్ కోడ్ల రద్దు కోసం ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు, త దితరులు పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
పనులు త్వరగా పూర్తి చేయాలి


