మెదక్‌ను సుందరంగా తీర్చిదిద్దుతా
ఎమ్మెల్యే రోహిత్‌రావు
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్‌రావు అన్నారు. సోమవారం పట్టణంలోని 7, 8, 20 వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనన్నారు. ఇటీవల పట్టణాభివృద్ధి కోసం టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ. 55 కోట్లు వచ్చాయని, పనులు త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీలేదని, నియోజకవర్గ అభివృద్ధియే తన ఆకాంక్ష అన్నారు. రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి రూ. కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మెదక్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్‌రావు, మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, మమత, శ్రీధర్ యాదవ్, దొంతి ముత్యంగౌడ్, లింగం అంజాద్, గంగాధర్, శివరామకృష్ణ, పురం వెంకటనారాయణ, హరిత నర్సింగ్‌రావు, బట్టి సులోచన, గోదల జ్యోతి, స్వరూప, దయాసాగర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
»


