దేఖ్లేంగే.!
న్యూస్‌రీల్
రూ.కోటి వరకు ఖర్చుకుసై అంటున్న సర్పంచు అభ్యర్థులు
వార్డు సభ్యుల అభ్యర్థులు సైతం రూ.లక్షల్లో..
చాలామటుకు రియల్ వెంచర్లుండేగ్రామాలు జనరల్‌గా ప్రకటన
బడా రియల్ వ్యాపారులకుకలిసొచ్చిన రిజర్వేషన్లు
శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా ఉండే గ్రామాల్లో పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ గ్రామాల్లో సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమలు, వాణిజ్యపరమైన నిర్మాణాలు అధికంగా ఉండే గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు అవసరమైతే రూ.కోటి వరకు కూడా ఖర్చుకు వెనుకాడటం లేదనే చర్చ జరుగుతోంది. మారుమూల గ్రామ పంచాయతీలతో పోల్చితే ఈ గ్రామాల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయం అనేక రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. సర్పంచ్ పదవి అంటేనే సమాజంలో ప్రత్యేక విలువ ఉంటుంది. దీంతో చాలా మంది ప్రతిష్ట కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకునే వారికి ఈ సర్పంచు పదవి ఉంటే ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది. దీంతో నేతలు ఈ పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సర్పంచ్ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు అతికొద్ది మంది ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‘రియల్’ గ్రామాలు.. జనరల్ స్థానాలు
జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా, తొలి విడతలో 136 పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, హత్నూర, గుమ్మడిదల, పటాన్‌చెరు మండలాల్లో ఈ నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ మండలాల్లో సుమారు 40 శాతానికి పైగా గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు అధికంగా ఉన్నాయి. పరిశ్రమలతో పాటు, వాణిజ్యపరమైన నిర్మాణాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఈ గ్రామ పంచాయతీల్లో సర్పంచు పదవులను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికంగా జరిగే గ్రామాలు చాలా మటుకు జనరల్‌కు రిజర్వు అయ్యాయి. దీంతో ఎవరైనా పోటీ చేసే అవకాశం లభించడంతో రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు చేసే నేతలు, ఆర్థిక, అంగబలం ఉన్న నాయకులు బరిలో నిలుస్తున్నారు. దీంతో ఈ గ్రామాల్లో పోరు రసవత్తరంగా సాగుతోంది.
వార్డు సభ్యులు సైతం ఖర్చు సై..
‘రియల్’ గ్రామాల్లో
పల్లెపోరు ఆసక్తికరం
పెద్ద గ్రామ పంచాయతీల్లో సర్పంచు పదవులే కాదు, వార్డు సభ్యుల పదవులకు సైతం పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంది వంటి పెద్ద గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యుడి పదవి కూడా ప్రతిష్టాత్మకంగానే మారుతోంది. దీంతో ఈ అభ్యర్థులు రూ.పది లక్షల వరకు కూడా ఖర్చు చేసేందుకు వెనుకాడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేఖ్లేంగే.!


