తడిసిన మొక్కజొన్న కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

తడిసిన మొక్కజొన్న కొనుగోలు చేయాలి

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

మార్కెట్‌ కార్యాలయం వద్ద రైతుల ధర్నా

మార్కెట్‌ కార్యాలయం వద్ద రైతుల ధర్నా

హుస్నాబాద్‌: అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. మంగళవారం వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించి 18 రోజులు గడిచినా ఇప్పటి వరకు 4 వేల క్వింటాళ్లు మాత్రమే కొన్నారని తెలిపారు. కొనుగోళ్లు వేగవంతం చేయకపోవడం వల్లే అకాల వర్షానికి పంట తడిసిందన్నారు. వాతావరణ పరిస్థితులు బాగా లేవని ప్రచారం జరుగుతున్న అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, వికాస్‌ యాదవ్‌, కొమురయ్య, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement