హెచ్‌ఎం రామకృష్ణకు జాతీయ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎం రామకృష్ణకు జాతీయ పురస్కారం

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): మండలంలోని నిజాంపూర్‌ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ ఉగాది విశ్వ విఖ్యాత మహోన్నత జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, మనం ఫౌండేషన్‌ వారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మి కాంతరావు, తెలుగు సినిమా పాటల రచయిత టంగుటూరు రాందాస్‌, రిటైర్డ్‌ జిల్లా జడ్జి యాలాద్రి, పద్మలతారెడ్డి రామకృష్ణకు పురస్కారం ప్రదానం చేశారు. విద్యా, సామాజిక రంగాల్లో చేసిన సేవలకు ఈ పురస్కారం అందించినట్లు మనం ఫౌండేషన్‌ ఫౌండర్‌, చెర్మన్‌ డా.చక్రవర్తి తెలిపారు. హెచ్‌ఎంను ఎంఈవో శంకర్‌, ఉపాధ్యాయులు తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement