540 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

540 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ సీజ్‌

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

పటాన్‌చెరు టౌన్‌: నాణ్యత లేకుండా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్నారన్న అనుమానంతో తయారీ కేంద్రంపై ఎస్వోటీ సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో 540 కిలోల అల్లం వెల్లుల్లి పేస్టును సీజ్‌ చేశారు. ఈ సంఘటన పటాన్‌చెరు శ్రీనగర్‌ కాలనీలో చోటుచేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న కేంద్రాన్ని సోమవా రం ఎస్‌ఓటీ సిబ్బంది గుర్తించి, ఫుడ్‌ సేఫ్టీ అధికారుల సహాయంతో మంగళవారం తనిఖీలు నిర్వహించి నమూనాలను సేకరించారు. వీటిని ల్యాబ్‌కు పంపించారు. వీరు తయారు చేసే అల్లం వెల్లుల్లి పేస్టులో నాణ్యత లేకుండా కల్తీ ఉందన్న అనుమానంతో తయారు చేసిన మిశ్రమం, ఇతర రసాయనాలు సీజ్‌ చేసినట్లు తెలిపారు. ల్యాబ్‌ నివేదిక వచ్చిన తర్వాత కల్తీ అని తెలిస్తే పటాన్‌చెరు పోలీసులకు అప్పజెప్పి కేసు నమోదు చేయిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement