గ్రామ సభలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గ్రామ సభలకు ఏర్పాట్లు చేయాలి

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

కలెక్టర్‌ ప్రావీణ్య

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 2 నుంచి నిర్వహించే గ్రామసభలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రావీణ్య మండల పరిషత్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ పాండు, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి తదితరులతో కలిసి మంగళవారం వీడియో సమీక్ష నిర్వహించి, గ్రామసభల ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతీ గ్రామసభ ఉదయం 10 గంటలకు ప్రారంభించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలపై పూర్తి వివరాల సమాచారం అధికారుల వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి కొత్త పథకాల వివరాలు కూడా గ్రామసభలలో వివరించాలన్నారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, మహిళా సంఘాలు తదితరులు గ్రామసభలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, వృద్ధుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, తెలిపారు. సమీక్షలో మండల పరిషత్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యను అందించాలి

కొండాపూర్‌ (సంగారెడ్డి): విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి వహించాలని జిల్లా కలెక్టర్‌ ప్రావీణ్య సూచించారు. కలెక్టర్‌ గుంతపల్లి గ్రామా న్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుంతపల్లి లోని ప్రాథమిక పాఠశాల అంగన్‌ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ వసతులు, సేవల నాణ్యతను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement