‘అష్టమి’ ఎఫెక్ట్‌.. | - | Sakshi
Sakshi News home page

‘అష్టమి’ ఎఫెక్ట్‌..

Nov 29 2025 7:51 AM | Updated on Nov 29 2025 7:51 AM

‘అష్టమి’ ఎఫెక్ట్‌..

‘అష్టమి’ ఎఫెక్ట్‌..

‘నవమి’ కోసం వేచిచూసి

చీకటిపడిన తరువాతకొనసాగిన నామినేషన్ల సందడి

వర్గల్‌(గజ్వేల్‌): పంచాయతీ సంగ్రామంలో నిలబడే అభ్యర్థులు శుభముహుర్తాలు చూసుకుంటున్నారు. ‘శుక్రవారం అష్టమి బాగుండదు, సాయంత్రం నవమి వచ్చేదాకా వేచిచూద్దామన్నట్లు’ చాలా వరకు అభ్యర్థులు వ్యవహరించారు. నవమి తిథికి అనుగుణంగా సాయంత్రం 5 గంటలలోపు క్లస్టర్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్కొక్కరుగా నామినేషన్లు వేశారు. దీంతో వర్గల్‌ మండలంలోని నెంటూరు, వర్గల్‌, మీనాజీపేట క్లస్టర్‌ కేంద్రాలలో చీకటి పడిన తరువాత కూడా అభ్యర్థుల నామినేషన్ల సందడి కొనసాగింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోగా కేంద్రానికి వచ్చిన వారందరికి చీకటిపడినప్పటికీ నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కల్పించామని ఈ సందర్భంగా వర్గల్‌ ఎంపీడీఓ మచ్చేందర్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement