విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
కొండపాక(గజ్వేల్): హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న ఓ కారు లారీని ఓవర్‌టేక్ చేయబోయి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. విషయం తెలుసుకున్న టోల్ ప్లాజా సిబ్బంది, హెచ్‌కేఆర్ సంస్థ, కుకునూరుపల్లి పోలీసులు అక్కడకు చేరుకొని ఆ స్తంభాన్ని పక్కకు జరిపారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దుకాణాదారులు రోడ్డును ఆక్రమించుకొని షెడ్లు వేసుకోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.


