అనుమతుల్లేకుండా చెట్ల నరికివేత
నర్సాపూర్: నీలగిరి చెట్ల నరికివేతలో నిబంధనలు ఉల్లంఘించిన ఘటన చోటు చేసుకుంది. నరికిన దుంగల నుంచి తొక్క తీసే పనులను బాల కార్మికులతో చేయిస్తున్నారు. వివరాలు ఇలా... అటవీ శాఖ నర్సాపూర్ రేంజ్‌లోని వెంకట్రావ్‌పేట సెక్షన్ పరిధిలోని రాయలాపూర్ గ్రామంలోని ( కౌడిపల్లి మండలం ) ఓ రైతు తన పొలంలో పెంచిన నీలగిరి చెట్లను శనివారం నరికివేత పనులు చేపట్టారు. కాగా పట్టా పొలంలో పెంచిన చెట్లను నరకడానికి అటవీ శాఖ నుంచి అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దీంతోపాటు చెట్టుకు రూ.50 రుసుం అటవీ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. వీటికంటే ముందు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే నిర్ధారణ చేస్తారు. కాగా చెట్లను నరికి ఓ కంపెనీకి సరఫరా చేస్తున్నామని, అనుమతులు అవసరం లేదని చెబుతున్నారు. కలపను ఆంధ్రప్రదేశ్‌కు రవాణా చేస్తున్నట్లు తెలిసింది.
నిబంధనలు ఉల్లంఘించి పనులు
నిబంధనల మేరకు చెట్లను నరికిన పొలంలోనే దుంగల తొక్క తీయాలి. కానీ రాయలాపూర్‌లో చెట్లను నరికి దుంగలుగా చేసి లారీల్లో నింపి నర్సాపూర్ పరిధిలోని వెల్దుర్తి మార్గంలోని ఖాళీ ప్రాంతానికి తీసుకొచ్చి తొక్క తీసే పనులు చేపడుతున్నారు. కాగా ఈ తొక్క తీసే పనుల్లో ఓ బాలకార్మికురాలితో పనులు చేయించారు. అయితే చెట్ల నరికివేత ఘటనపై స్థానిక అటవీ శాఖ రేంజ్ అధికారి అరవింద్‌ను వివరణ కోరగా... చెట్లను నరికేందుకు రాయలాపూర్ నుంచి ఎలాంటి దరఖాస్తు రాలేదని చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సూచనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బాలకార్మికులతో పనులు


