రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..
ఫొటోగ్రాఫర్ దుర్మరణం
సదాశివపేట(సంగారెడ్డి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామ పరిధిలోని మార్కండేయనగర్ కాలనీకి చెందిన కోంశెట్‌పల్లి నర్సింహులు(40) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం బీరంగూడలో ఫంక్షన్‌కు వెళ్లి ఫొటోలు తీసిన తరువాత సదాశివపేటకు కర్ణాటక బస్సులో వస్తున్నాడు. ఈ క్రమంలో సదాశివపేట పట్టణంలోని బస్టాండుకు రాకుండా బైపాస్ మీదుగా వెళ్తుండగా నిద్రమత్తులో నుంచి మేలుకుని బస్సును మద్దికుంట కూడలి వద్ద ఆపి దిగాడు. పట్టణానికి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా జహీరాబాద్ వెళ్తున్న గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మణం చెందాడు.
మత్తు పదార్థం స్వాధీనం
తూప్రాన్: నిషేధిత మత్తు పదార్థాన్ని ఎకై ్సజ్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ గులాం ముస్తాఫా వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన రావల్‌సింగ్ అదే ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు బస్సులో నిషేధిత పాప్పి స్ట్రా పౌడర్ 430 గ్రాములు తీసుకొస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు తూప్రాన్ పట్టణ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద బస్సును తనిఖీ చేశారు. నిందితుడు రావల్‌సింగ్‌ను అదుపులోకి తీసుకుని మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సిబ్బంది మహ్మద్ ఖాజా అజీజ్, రాఘవేందర్ రావు, అనిల్, సత్తయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.
ఆర్‌ఎంపీ డాక్టర్ రిమాండ్
చేర్యాల(సిద్దిపేట): ఆర్‌ఎంపీ డాక్టర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ రాజు వివరాల ప్రకారం... మండల పరిధిలోని నాగపురి గ్రామంలో ఆర్‌ఎంపీ సిరిగిరి జనార్దన్ అనుమతి లేకుండా క్లినిక్ నడుపుతూ వైద్యం చేస్తున్నాడు. కాగా ఈ నెల 3వ తేదీన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు జనార్దన్‌పై కేసు నమోదు చేశారు. సరైన సాక్ష్యాధారాలతో శనివారం కోర్టులో హాజరుపరిచినట్లు వెల్ల్లడించారు.
రోడ్డు ప్రమాదాల్లో
ముగ్గురికి గాయాలు
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చేగుంట శివారులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని కరీంనగర్ గ్రామానికి చెందిన చాకలి భూపేశ్ చేగుంట నుంచి స్వగ్రామం వెళ్తుండగా మార్గమధ్యలో జీవిక పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడ్ని తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు.
కారు బోల్తా పడి..
కొండపాక(గజ్వేల్): హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు సొంత కారులో మహమ్మద్ జావిద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొండపాక శివారులో మెదక్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో రాజీవ్ రహదారిపై ఉన్న మూల మలుపు వద్ద కారు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అతడికి గాయాలయ్యాయి. కారు పూర్తిగా దెబ్బతిన్నది. అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కారు, బైక్ ఢీకొన్న ఘటనలో..
దౌల్తాబాద్ (దుబ్బాక): మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామానికి చెందిన అబ్రమైన రాములు దౌల్తాబాద్‌కు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో కోనాయిపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అంబులెన్స్‌లో గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..


