ఉత్సాహంగా స్పార్క్ ఫెస్ట్
కంది(సంగారెడ్డి): మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం స్పార్క్ ఫెస్ట్ –2025 ఉత్సాహంగా జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ ఫెస్టులో విద్యార్థులకు వ్యాసరచన, డిబేట్ (వాదప్రతివాద) క్విజ్, వక్తృత్వ, సాహిత్య, పాటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్‌ఎల్‌సీ బహుమతి, విజిలెన్స్ ఆఫీసర్స్ మహమ్మద్ గౌస్, జగదీశ్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ కవిత, అకాడమిక్ కోఆర్డినేటర్ ఫసియుద్దీన్ బహుమతులను అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
తండ్రి రుణం తీర్చుకున్న కూతురు
అక్కన్నపేట(హుస్నాబాద్): కూతురే కొడుకై తండ్రికి తలకొరివి పెట్టింది. ఈ ఘటన మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బొంతల మాధవరెడ్డి ఆరేళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ శనివారం మరణించారు. కాగా వారికి ఒక్కగానొక్క కూతురు తల్లిగారి ఇంటి వద్దే ఉంటూ తండ్రికి సేవలు చేస్తూ వస్తోంది. సుమారు ఆరేళ్ల కిందట తల్లి కూడా చనిపోయింది. అప్పటి నుంచి తండ్రితోనే ఉంటూ కూతురు సేవలు చేస్తున్నారు. కొడుకులు లేకపోవడంతో తండ్రి అంత్యక్రియలు కూతురే నిర్వహించింది.
పేకాట రాయుళ్ల అరెస్ట్
జహీరాబాద్: పేకాట ఆడుతున్న పదకొండు మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. చిన్న హైదరాబాద్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు శనివారం విశ్వసనీయ సమాచారం వచ్చింది. ఈ మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి 11 మందిని అరెస్టు చేసినట్లు టౌన్ ఎస్.ఐ కె.వినయ్‌కుమార్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.40,150 నగదు, 4 మోటారు సైకిళ్లు, 14 సెల్‌ఫోన్లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు.
రూ.40,150 నగదు స్వాధీనం
ఉత్సాహంగా స్పార్క్ ఫెస్ట్
ఉత్సాహంగా స్పార్క్ ఫెస్ట్


