యోగాసన క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

యోగాసన క్రీడాకారుల ఎంపిక

Nov 8 2025 9:38 AM | Updated on Nov 8 2025 9:38 AM

యోగాస

యోగాసన క్రీడాకారుల ఎంపిక

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): అండర్‌–14, 17లో ఉమ్మడి మెదక్‌ జిల్లా యోగాసన క్రీడాకారుల ఎంపిక ఈ నెల 12న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నారాయణరావుపేటలో ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సౌందర్య శుక్రవారం తెలిపారు. వివరాలకు స్థానిక వ్యాయామ ఉపాధ్యాయులు తోట సతీశ్‌ (9948110433)ను సంప్రదించాలని సూచించారు.

గిరిజన విద్యార్థికి డాక్టరేట్‌

అక్కన్నపేట(హుస్నాబాద్‌): మండలంలోని పెద్దతండా గ్రామపంచాయతీ పరిధిలోని పంజాగుట్టతండాకు చెందిన గుగులోతు తిరుపతినాయక్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు విభాగంలో డాక్టరేట్‌ను పొందారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు డాక్టర్‌ కాశీం, చంద్రశేఖర్‌, సెల్మానాయక్‌, ప్రేమ్‌ చేతుల మీదుగా ఆయన పట్టాను అందుకున్నారు. పలువురు తండావాసులు, యువకులు ఆయనను అభినందించారు.

’ఎన్‌ క్వాస్‌’కు ఎంపికై న

నందికంది సబ్‌ సెంటర్‌

సదాశివపేట రూరల్‌(రూరల్‌): మండలంలోని నందికంది ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ (హెల్త్‌ సబ్‌ సెంటర్‌) జాతీయ నాణ్యత ప్రమాణాలకు (ఎన్‌ క్వాస్‌ నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్సు స్టాండర్డ్స్‌) ఎంపికై ంది. వర్చువల్‌ అసెస్మెంట్‌లో భాగంగా గత నెల 15న సబ్‌ సెంటర్‌ను కేంద్ర బృందం సభ్యులు సందర్శించి ఏడు అంశాలను పరిశీలించారు. కాగా ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో 92.69 శాతం స్కోర్‌తో జాతీయ నాణ్యత ప్రమాణాలకు ఎంపిక చేశారు. ఎన్‌ క్వాస్‌ అవార్డును పొందిన నందికంది సబ్‌ సెంటర్‌కు ప్రోత్సాహక నగదు అందనుందని మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రీతీ శుక్రవారం తెలిపారు. దీంతో సబ్‌ సెంటర్‌లో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.

రెడీమిక్స్‌ వాహనం పల్టీ

పటాన్‌చెరు టౌన్‌: వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటన పటాన్‌చెరు పాత టోల్‌ గేట్‌ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రెడీమిక్స్‌ వాహనం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పాటీ లింగంపల్లి వెళ్తుండగా పటాన్‌చెరు పాత టోల్‌గేట్‌ వద్ద అదుపుతప్పి టోల్‌ గేట్‌ దిమ్మలపై పడింది. అయితే వాహనం దిమ్మల మధ్య ఉండటంతో తీసేందుకు కష్టంగా మారింది. పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ హుస్సేన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

స్క్రాప్‌ దుకాణంలో

అగ్ని ప్రమాదం

దుబ్బాకటౌన్‌: దుబ్బాక పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాలు... శుక్రవారం ఉదయం స్క్రాప్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. స్క్రాప్‌ కావడంతో అక్కడున్న పాత బైక్‌లు, టైర్లు, పోగు చేసిన కాగితాలు అంటుకుని దట్టమైన పొగతో పాటు మంటలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీస్‌, ఫైర్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ అధికారులు మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ. 12 వేల ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఎవరైనా తగలబెట్టారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

యోగాసన క్రీడాకారుల ఎంపిక1
1/2

యోగాసన క్రీడాకారుల ఎంపిక

యోగాసన క్రీడాకారుల ఎంపిక2
2/2

యోగాసన క్రీడాకారుల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement