చిరుసంచుల ‘వరిసాగుతో’ లాభాలు
ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త నిర్మల
చిలప్‌చెడ్(నర్సాపూర్): చిరుసంచుల వరి సాగుతో అధిక దిగుబడి సాధించవచ్చని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నిర్మల అన్నారు. మంగళవారం ఆమె శాస్త్రవేత్తల బృందంతో కలిసి మండల పరిధిలోని చండూర్, ఫైజాబాద్ గ్రామాల్లో వరి సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా వరి పంటలో ప్రయోగదశలో ఉన్న డబ్య్లూజీఎల్–1380 అనే రకానికి సంబంధించిన మిక్కిలి, మధ్యస్థ గింజల వరి రకం 135 రోజుల్లో, కేపీఎస్–10642 సన్న గింజ రకం 125 రోజుల్లో కోతకు వస్తుందని తెలిపారు. ఇది వానాకాలానికి అనువైన రకమన్నారు. శాస్త్రవేత్తలు అరుణ, ఆకాశ్, రైతు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


