వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
వర్గల్(గజ్వేల్): ఇంటి నుంచి వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మండలంలోని గౌరారంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నరాని రాములు కుమారుడు సాయికుమార్ (24) సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు.
జహీరాబాద్‌లో మహిళ..
జహీరాబాద్ టౌన్: మహిళ అదృశ్యమైన ఘటన మండలంలోని రంజోల్ గ్రామంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ.కాశీనాథ్ వివరాల పక్రారం... గ్రామానికి చెందిన అలిగే నర్సింహులు భార్య క్రిస్టినా(21) ఈ నెల 26న అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులను విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం


