విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ సర్టిఫికెట్లు
సిద్దిపేటరూరల్: జక్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు మద్రాస్ ఐఐటీతో డాటా ఎనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక భావనలపై 8 వారాల కోర్సు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు పొందారని ప్రధానోపాధ్యాయుడు షౌకత్‌అలీ బుధవారం తెలిపారు. 13 మంది విద్యార్థులు కోర్సు నేర్చుకున్నారని, వారిలో 11 మంది ఉత్తీర్ణత సర్టిఫికెట్, మరో ఇద్దరు భాగస్వామ్య సర్టిఫికెట్ పొందారని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు రాజేందర్‌ను ఉపాధ్యాయ బృందం సన్మానించింది. అనంతరం ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు పొందిన సర్టిఫికెట్లను అందించారు.
బక్రిచెప్యాల పాఠశాల...
సిద్దిపేట అర్బన్: ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో అందించిన ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సును బక్రిచెప్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పూర్తి చేశారని ఉపాధ్యాయుడు పూర్ణచందర్‌రావు తెలిపారు. పదవ తరగతికి చెందిన ఐదుగురు విద్యార్థులు దుగ్యాని చైతన్య, సూరం సుష్మిత, స్నేహ, పిండి సహస్ర, బొమ్మ కీర్తన కోర్సు పూర్తి చేశారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేందర్‌రెడ్డి సర్టిఫికెట్స్‌ను అందించి అభినందించారు.


