మొబైల్‌యాప్‌లో వన్యప్రాణుల గణన
శిక్షణకు హాజరైన ఫారెస్ట్ సిబ్బంది
చిన్నశంకరంపేట(మెదక్): వన్యప్రాణుల గణన కోసం మొబైల్‌యాప్‌ను ఉపయోగించి కచ్చితమైన సమాచారం సేకరించేందుకు అటవీశాఖ సిబ్బంది కృషి చేయాలని హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ల్యాండ్‌స్కేప్ కోఆర్డినేటర్ బాపురెడ్డి కోరారు. బుధవారం నార్సింగి మండల వల్లూర్ సెంట్రల్ నర్సరీలో జిల్లాలోని అటవీశాఖ సిబ్బందికి ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ స్థాయిలో జరుగుతున్న వన్యప్రాణుల లెక్కింపుపై ప్రత్యేక దృష్టితో పనిచేయాలని సూచించారు. మొదట ఎంచుకున్న ప్రదేశంలో సంచరిస్తున్న వన్యప్రాణులను అంచనా వేసి మొబైల్‌యాప్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విజయ్‌కుమార్, ఆఫీసర్ రామలీల, సిబ్బంది పాల్గొన్నారు.


