యువకుడికి కృత్రిమ కాలు..
అమర్చిన స్వచ్ఛంద సంస్థ
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు కాలు కోల్పోగా ఓ స్వచ్ఛంద సంస్థ కృత్రిమ కాలును అందజేసింది. వివరాలు... మండలంలోని ఖాజాపూర్ తండాకు చెందిన రమేశ్‌కు సానీక్ష ఫౌండేషన్ సహకారంతో ఉచితంగా కృత్రిమ కాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ వికాస్ పరిషద్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో అతడికి ఉచితంగా కృత్రిమ కాలును పెట్టించినట్లు సానీక్ష ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ తెలిపారు. ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన బాధితులు ఉంటే తమను సంప్రదించాలని, ఉచితంగా కృత్రిమ కాలు పెట్టించనున్నట్లు ఇక్షణ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.


