పశు సంపద అభివృద్ధే ధ్యేయం
రాష్ట్ర మానిటరింగ్ అధికారి డాక్టర్ శిరీష
నర్సాపూర్ రూరల్: పశు సంపద అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్, డాక్టర్ శిరీష జిల్లా పశు వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని తిరుమాలపూర్‌లో నవార్టస్ నేషనల్ ఆగ్రో ఫౌండేషన్, జిల్లా పశుసంవర్ధక శాఖ నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరంలో పాల్గొని మాట్లాడారు. పశు సంపద కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఉచిత గర్భాధారణ టీకాలు, పాడి రైతులకు పాల దిగుబడిని పెంచేందుకు మినరల్ మిశ్చర్, కాల్షియం సప్లిమెంట్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో నర్సాపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జనార్దన్ రావు, పశు వైద్యాధికారులు సమిత్ కుమార్, స్వప్న, విదేశం, ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు.


