కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు | - | Sakshi
Sakshi News home page

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

Oct 19 2025 8:31 AM | Updated on Oct 19 2025 8:31 AM

కొడుక

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

అన్నం పెట్టమంటే దాడులు..

కలెక్టర్‌కు ఫిర్యాదులు..

కుమారులకు కౌన్సెలింగ్‌

కాగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా 11 మంది వృద్ధులు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. వాటిని పరిశీలించి వారి పిల్లలను పిలిపించి తల్లిదండ్రులను పోషించడం ‘భారం కాదు బాధ్యతగా’ తీసుకోవాలని పలువురికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. నెలకు రూ. 10 వేలకు తగ్గకుండా వారి వ్యాధులను బట్టి ఇవ్వాలని ఆదేశించారు. లేనిచో సీనియర్‌ సిటిజన్‌ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో కొందరు పిల్లలు మనసు మార్చుకుని వారి తల్లిదండ్రులను ఇళ్లకు తీసుకెళ్లగా, మరికొందరు పోషణ కోసం నెలనెల డబ్బులు ఇస్తామని ఒప్పుకుంటున్నారు. ఇంకొందరు అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు.

కన్న బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేసి వివాహాలు చేస్తే తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. జీవిత చరమాంకంలో చూడాల్సిన కొడుకులు గాలికొదిలేస్తున్నారు. పట్టెడన్నం పెట్టమంటే తల్లిదండ్రులను కొట్టి గెంటేస్తున్నారు. ఆస్తులు లాక్కొని రోడ్డున పడేస్తుండటంతో వృద్ధులు తిండి, గూడు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొందరు భిక్షాటన చేస్తుండగా, మరికొందరు అధికారులను ఆశ్రయిస్తున్నారు. కొడుకుల దాష్టీకాలపై ఈ వారం కథనం.

– మెదక్‌జోన్‌

మెదక్‌ జిల్లాలో కన్న బిడ్డలు తిండి పెట్టడం లేదని ప్రజావాణిలో వృద్ధులు కలెక్టర్‌ను కలిసి వేడుకుంటున్నారు. కడుపు కట్టుకుని పిల్లల్ని ప్రయోజకులను చేశామంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి అభాగ్యులను కలెక్టర్‌ ప్రత్యేకంగా పిలిపించి (సీనియర్‌ సిటిజన్‌ యాక్టు) ప్రకారం కన్న తల్లిదండ్రులను పోషించకుండా విస్మరించిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వీరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్కడ సమస్య పరిష్కారం కాని వారు నేరుగా కలెక్టరేట్‌లోని రెవెన్యూ(సీ) సెక్షన్‌లో అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలనడంతో నేరుగా వృద్ధులు కలెక్టర్‌ కార్యాలయానికి వస్తున్నారు.

వృద్ధాశ్రమాల్లో అభాగ్యులెందరో..

మెదక్‌ జిల్లా కేంద్రంలో సంధ్యానిలయంలో కొందరు తలదాచుకుంటున్నారు. ఏ దిక్కులేని కొందరు కాగా మరి కొంత మంది అందరూ ఉండి కూడా ఇళ్ల నుంచి గెంటివేయబడిన అభాగ్యులు. ఇలాంటి వారి కోసం పిల్లికొటాల్‌ వద్ద గల ఎంసీహెచ్‌ ఆస్పత్రి సమీపంలో ఓ ఆశ్రమం నిర్మించారు. కానీ అది పట్టణానికి దూరంగా ఉండటంతో అక్కడికి వెళ్లకుండా జిల్లా కేంద్రంలో భిక్షాటన చేసి ఫుట్‌పాత్‌లపై తల దాచుకుంటున్నారు. కాగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారిపై చట్టాలు కఠినంగా అమలు చేసి వృద్ధులకు అండగా నిలవాలని పలు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కుమారుడు గెంటివేస్తే..

సిద్దిపేట రూరల్‌ మండల పరిధిలోని పుల్లూరులో గ్రామానికి చెందిన గొడుగు పోచయ్య(67)ను అవసాన దశలో పోషించలేక ఇంటి నుంచి కొడుకులు వెళ్లగొట్టారు. దీంతో ఎటుపోవాలో తెలియక రైతు వేదికలో తల దాచుకున్నాడు. తెల్లారేసరికి విగతజీవిగా కనిపించాడు. కాగా భర్తకు భార్య యాదవ్వనే అంత్యక్రియలు నిర్వహించింది.

ఆస్తులు లాక్కొని రోడ్డున పడేస్తున్న వైనం

కలెక్టర్‌ను ఆశ్రయించిన 11 మంది వృద్ధులు

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 1
1/4

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 2
2/4

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 3
3/4

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 4
4/4

కొడుకుల దాష్టీకానికి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement