
ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య
దుబ్బాకటౌన్: ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుబ్బాక పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై కీర్తి రాజు వివరాల ప్రకారం... పట్టణానికి చెందిన జమునగారి ప్రవీణ్ కుమార్ (33) వ్యవసాయంతో పాటు వరి కోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు, ముగ్గురు సోదరులతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం వ్యవసాయ నిర్వహణతో పాటు ఇతర అవసరాల కోసం 8 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో చేసిన అప్పులు తీర్చలేక, తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ప్రవీణ్ శుక్రవారం రాత్రి పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
మనస్తాపంతో వ్యక్తి..
పాపన్నపేట(మెదక్): మనస్తాపంతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఆరెపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన మష్కరి లక్ష్మయ్య(57)వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. కొంత కాలంగా అతను మద్యానికి అలవాటు పడ్డాడు. ఈ నెల 16న అతిగా మద్యం తాగి వచ్చిన అతన్ని భార్యలు నిలదీశారు. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మయ్య బయటకు వెళ్లి పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. నోట్లో నుంచి నురగలు వస్తుండటంతో గమనించిన కుటుంబీకులు మెదక్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.
కుటుంబ సమస్యలతో మేసీ్త్ర..
రామాయంపేట(మెదక్): కుటుంబ సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... రామాయంపేట పట్టణానికి చెందిన పెంటమీది మల్లేశం (38) మేసీ్త్ర పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్యతో గొడవపడిన మల్లేశం ఆమెతోపాటు ముగ్గురు పిల్లలను ఇంటి నుంచి పంపించి రాత్రి ఉరి వేసుకున్నాడు. పక్క ఇంట్లో ఉంటున్న వారు చూసి మృతుడి భార్య అనితకు సమాచారం అందజేశారు.

ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య

ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య