రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

Oct 19 2025 8:31 AM | Updated on Oct 19 2025 8:31 AM

రాష్ట

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

గజ్వేల్‌రూరల్‌: రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు టీజీఎంఎస్‌(తెలంగాణ మోడల్‌ స్కూల్‌)కు చెందిన విద్యార్థిని లావణ్య ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ వన్నెసా తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ అండర్‌–17 విభాగంలో ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికై ంది. ఈ సందర్భంగా విద్యార్థిని లావణ్యతో పాటు పీడీ పద్మను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

372 క్వింటాళ్ల రేషన్‌

బియ్యం పట్టివేత

మిరుదొడ్డి(దుబ్బాక): ఓ రైస్‌మిల్లుపై అధికారులు దాడులు చేసి పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా... అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామ శివారులోని లక్ష్మీప్రసన్న రైస్‌ మిల్‌పై విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. రైస్‌మిల్లులో 372.40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి మరో రైస్‌ మిల్‌కు అధిక ధరలకు అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. బియ్యాన్ని సీజ్‌ చేసి మంజునాథ రైస్‌ మిల్‌కు తరలించినట్లు అసిస్టెంట్‌ సివిల్‌ సప్లై అధికారి ఎం.సాయి రవి తెలిపారు. కాగా రైస్‌ మిల్లు నిర్వహిస్తున్న కాపర్తి సంతోష్‌తో పాటు అతని పార్టనర్స్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరీశ్‌ తెలినారు.

రెండు బైక్‌లు ఢీ..

ఇద్దరికి గాయాలు

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధి మిర్జాపూర్‌(ఎన్‌) గ్రామ శివారులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. హద్నూర్‌ ఎస్‌ఐ సుజిత్‌ కథనం ప్రకారం... ఝరాసంగం మండల పరిధి తుమ్మన్‌పల్లికి చెందిన నదీం కుటుంబ సభ్యులతో కలిసి ముంగి గ్రామంలో జరిగే విందుకు బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో రాయికోడ్‌కు చెందిన మరో వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. మిర్జాపూర్‌(ఎన్‌)గ్రామ శివారులో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నదీంకు కాలు విరిగింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జహీరాబాద్‌కు ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

వ్యక్తిపై కత్తితో

దాడి.. గాయాలు

జహీరాబాద్‌ టౌన్‌: ఓ వ్యక్తి చిరువ్యాపారిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. టౌన్‌ ఎస్‌ఐ.వినయ్‌కుమార్‌ కథనం ప్రకారం... తమిళనాడు మధురై జిల్లా పరిమల్‌పట్టికి చెందిన పుతురాజు సుమారు మూడేళ్ల నుంచి పట్టణంలోని ఐడీఎస్‌ఎంటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. స్నాక్స్‌ తయారు చేసుకుని ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన మరో వ్యక్తి మణికంఠ(29) కూడా హమాలీ కాలనీలో నివాసం ఉంటూ ఆయన ఇదే వ్యాపారం చేస్తున్నాడు. తాను వ్యాపారం చేస్తున్న ప్రాంతంలోకి రావద్దని మణికంఠ ఇటీవల పుతురాజును బెదిరించాడు. అయితే చెప్పిన మాట వినడం లేదని మణికంఠ అతడిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో స్నాక్స్‌ అమ్ముకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా పుతురాజును పార్కు వద్ద అడ్డుకుని, బూతులు తిడుతూ కత్తితో వీపుపై దాడి చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో మణికంఠ పరారయ్యాడు. వెంటనే గాయపడిన అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

నానమ్మకు తలకొరివి పెట్టిన మనుమరాలు

సిద్దిపేటరూరల్‌: విధి ఆడిన వింతనాటకంలో 14 సంవత్సరాల రమ్య అభాగ్యురాలిగా మిగిలింది. ఇంటి పెద్ద దిక్కు నానమ్మ కూడా అనారోగ్యంతో చనిపోవడంతో మనుమరాలు రమ్య అన్నీ తానై తలకొరివి పెట్టిన ఘటన శనివారం రావురూకుల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బ్యాగరి మల్లవ్వ, మనువరాలైన రమ్యతో కలిసి నివాసం ఉంటుంది. మల్లవ్వ ఇటీల అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందింది. కాగా మల్లవ్వ భర్త వెంకయ్య గతంలో చనిపోగా, నాలుగేళ్ల కిందట కొడుకు, కోడలు కూడా అనారోగ్యంతో చనిపోయారు. రమ్యకు ఒక్క ఆధారమైన మల్లవ్వ మృతి చెందడంతో అనాథగా మారిన రమ్యను చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా గ్రామస్తులు అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేశారు.

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక 1
1/2

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక 2
2/2

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement