
అదృశ్యమై.. హత్యకు గురై..
కుళ్లిన స్థితిలో చెరువులో మృతదేహం లభ్యం
వర్గల్/ములుగు(గజ్వేల్): అదృశ్యమైన మహిళ హత్య కు గురైంది. గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం... వర్గల్ మండలం మీనాజీపేటకు చెందిన మంకని బాలమణి(55) ఈ నెల 10న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఆమె కూతురు నవనీత ఫిర్యాదు మేరకు 12న గౌరారం పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తు ఓ వైపు, కుటుంబీకులు, బంధుగణం ఆమె ఆచూకీ కోసం పలుచోట్ల వెతుకుతున్నారు. ఈ తరుణంలో శుక్రవారం రాత్రి ములుగు మండలం తున్కిబొల్లారం అయ్యప్ప చెరువులో నల్లటి ప్లాస్టిక్ కవర్ చుట్టేసి, కుళ్లిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహం వెలికి తీయించి మీనాజీపేటకు చెందిన బాలమణిగా గుర్తించారు. ఆమె హత్యకు గురైనట్లు నిర్ధారించి, పలు ఆధారాలు సేకరించారు. శనివారం మృతదేహానికి గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపించి కుటుంబీకులకు అప్పగించారు.
మెట్ల పైనుంచి జారి పడి కూలి మృతి
సంగారెడ్డి క్రైమ్: ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారి పడి కూలి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణ పోలీసు స్టేషన్ ఫరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... పట్టణంలోని శివాజీనగ ర్ కాలనీకి చెందిన శేఖర్(43) వృత్తిరీత్య కూలీ పను లు చేస్తున్నాడు. ఈ నెల 17న ఉదయం 10గంటల సమయంలో అద్దెకు ఉంటున్న ఇంట్లోని మెట్లపై నుంచి కాలు జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడికి తలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికు లు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి ..
గజ్వేల్‌రూరల్: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పిడిచెడ్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సూరారం కిషన్(28)కు భార్యతో పాటు ఓ కూతురు ఉన్నారు. రెండేళ్ల క్రితం కిషన్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నప్పటికీ తగ్గకపోవడంతో కూతురితో కలిసి భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అతడు ఈనెల 12న పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

అదృశ్యమై.. హత్యకు గురై..