సనాతన ధర్మమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సనాతన ధర్మమే లక్ష్యం

Oct 19 2025 8:31 AM | Updated on Oct 19 2025 8:31 AM

సనాతన ధర్మమే లక్ష్యం

సనాతన ధర్మమే లక్ష్యం

కొమురవెల్లి(సిద్దిపేట): సనాతన ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆలయాల పరిరక్షణ కోసం ముందుకు సాగుతున్నామని సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం బర్ధిపూర్‌ ఆశ్రమ పీఠాధిపతులు వైరాగ్య శిఖామణి, మహామండలేశ్వర్‌, సిద్ధేశ్వరనందగిరి మహరాజు అన్నారు. శనివారం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పురాతన ఆలయాల పరిరక్షణ కోసం పని చేయాలని సూచించారు. గ్రామాల్లో ఏమైనా పురాతన ఆలయాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్‌, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్‌, మల్లయ్య, లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement