
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
నర్సాపూర్ రూరల్: వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన మండలంలోని నాగులపల్లిలో శనివారం జరిగింది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రెడ్డిపల్లి ప్రశాంత్, భార్య జింకలత(23)ల మధ్య గొడవ జరిగింది. దీంతో శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం చుట్టుపక్కలతో పాటు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇంట్లో గొడవపడి వెళ్లి..
సంగారెడ్డి క్రైమ్: బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేశ్ వివరాల ప్రకారం... ఆంఽధ్రప్రదేశ్‌కు చెందిన తపేట్ల అల్లు రామలింగయ్య (38), సంగారెడ్డి పట్టణానికి వచ్చి గణేశ్‌నగర్ కాలనీలో స్థిరపడ్డాడు. వృత్తిరీత్య పట్టణంలో పద్మశాలి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య రాజేశ్వరి, ముగ్గురు పిల్లలున్నారు. కొన్ని నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత నెల 22న ఉదయం 10 గంటల సమయంలో ఇంట్లో భార్యతో గొడవపడి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టు పక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చేగుంటలో మహిళ
చేగుంట(తూప్రాన్): ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... మండల కేంద్రమైన చేగుంటకు చెందిన దుద్యాల కళ్యాణి శుక్రవారం బంధువుల ఇంటికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. శుక్రవారం రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం

వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం