
పత్రికా స్వేచ్ఛపై దాడి తగదు
‘సాక్షి’పై కూటమి దాడులు
ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులుఖండించిన ప్రజా సంఘాల నాయకులు
సంగారెడ్డి టౌన్ : పత్రికలు స్వేచ్ఛగా పనిచేస్తేనే ప్రజా స్వామ్యం పరిఢవిల్లుతుందని, మీడియా
స్వేచ్ఛ కు సంకెళ్లు వేస్తే ప్రజాస్వామ్య మనుగడకే చేటు చేసినట్లవుతుందని సంగారెడ్డి జిల్లాలో వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ పోలీసులు పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. నకిలీ మద్యం అంశాలపై కథనాలు రాసిన ‘సాక్షి’పై తప్పుడు కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని వక్తలు అభిప్రాయపడ్డారు. పత్రికల గొంతు నొక్కేలా వ్యవహరించడం మంచిదికాదని ముక్తకంఠంతో ఖండించారు.
పత్రికలపై కక్ష సాధింపు సరికాదు
పత్రికలపై ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. ‘సాక్షి’ఎడిటర్ ధనంజయరెడ్డి, పత్రికపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం రాజ్యాంగం ఇచ్చిన హక్కుకు కాలరాయడమే. పత్రికల విషయంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులుగా ఖండిస్తున్నాం.
– కూన వేణు,
యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు
అక్రమ కేసులు ఉపసంహరించాలి
సాక్షిఎడిటర్ ధనంజయరెడ్డిపై కక్ష సాధింపులతో కేసులు పెట్టడం సరికాదు. ప్రజల కోసం వార్తలు రాసే మీడియా ప్రతినిధులపై ప్రభుత్వం కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు పెట్టడం సరికాదు. కేసులను ఉపసంహరించుకోవాలి. – బంగారు కృష్ణ,
జన జాగృతి సేన, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
మానసిక హింసకు గురిచేయడం సరికాదు
ఫోర్త్ ఎస్టేట్‌గా వ్యవహరించే మీడియా ఎపుడు ప్రజల పక్షమే వాహించాలి. నిజాలను శోధించి ప్రజలను జాగరూకత పరిచే బాధ్యత కూడా మీడియాదే. ఏపీలో సరిగ్గా ఆ పాత్రనే పోషిస్తున్న ‘సాక్షి’దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి మీద ‘సాక్షి’సిబ్బంది మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టి మానసిక హింసకు గురించేయడం సరికాదు. పాలకులకు అనుకూలంగా రాయడం లేదని, పోలీసుల ద్వారా అణచివేతకు గురిచేస్తే అది పత్రికా స్వేచ్ఛను హరించడమే. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం వెంటనే మానుకోవాలి.
– వై.అశోక్ కుమార్,జిల్లా చైర్మన్, (టీపీజేఏసీ)

పత్రికా స్వేచ్ఛపై దాడి తగదు

పత్రికా స్వేచ్ఛపై దాడి తగదు

పత్రికా స్వేచ్ఛపై దాడి తగదు