
వాలీబాల్, ఖోఖో జట్లకు క్రీడాకారుల ఎంపిక
గజ్వేల్‌రూరల్: ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలుర, బాలికల వాలీబాల్, ఖోఖో విభాగంలో ఉమ్మడి జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ సమ్మయ్య తెలిపారు. పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లో ఉన్న మైదానంలో గురువారం సిద్దిపేట జిల్లా జట్ల ఎంపికను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని విద్యార్థులను అండర్–19 విభాగంలో వాలీబాల్, ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు బాలుర, బాలికల విభాగంలో క్రీడాజట్లను ఎంపిక చేశామన్నారు. బాలుర విభాగంలో వాలీబాల్‌కు 50మంది, ఖోఖోకు 50మంది క్రీడాకారులు హాజరవ్వగా.. ఒక్కో జట్టుకు 12 మంది చొప్పున, బాలికల విభాగంలో వాలీబాల్‌కు 45మంది, ఖోఖోకు 30మంది క్రీడాకారులు హాజరవ్వగా.. ఒక్కో జట్టుకు 12మంది చొప్పున మొత్తం 48మంది క్రీడాకారులను సిద్దిపేట జిల్లా నుంచి ఎంపిక చేశారన్నారు. వీరంతా ఈనెల 13న సంగారెడ్డిలోని గిర్మాపూర్‌లో జరిగే ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ఎంపికలో పాల్గొంటారని తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు రవికుమార్, గోవర్ధన్‌రెడ్డి, ఫుట్‌బాల్ కోచ్ నర్సింహులు, వాలీబాల్ క్రీడాకారుడు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.