
వంట గ్యాస్ లీక్
● వ్యాపించిన మంటలు
● ప్రాణపాయస్థితిలో యువకుడు
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఇంట్లో వంట గ్యాస్ లీకవడంతో మంటలు చెలరేగాయి. ఈ సంఘటన భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్‌ఐజీ కాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బాన్సువాడకు చెందిన కాంట్రాక్టర్ భాస్కర్ రెండేళ్లుగా ఎల్‌ఐజీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో మరో సిలిండర్‌ను అమర్చుతుండగా.. ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. భాస్కర్ సతీమణి మంజుల బయటకు రాగా.. వారి ఒకే ఒక్క కుమారుడు ఆనంద్ స్వరూప్ గ్యాస్ ధాటికి భయపడి మొదటి అంతస్తు నుంచి కింద పడిపోయాడు. అతడిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. సీఐఎస్‌ఎఫ్ అగ్నిమాపక దళానికి సమాచారం ఇవ్వడంతో వారు మంటలన్నీ అదుపులోకి తీసుకొచ్చారు.
గ్యాస్‌లీక్‌తో
వ్యాపించిన మంటలు