
మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్
జగదేవ్‌పూర్(గజ్వేల్): మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని గజ్వేల్ ఏసీపీ నర్సింలు వెల్లడించారు. ఈ మేరకు మండలంలోని బస్వాపూర్‌లో మహిళ హత్య కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన ఆలేటి యాదవరెడ్డి చిన్న కూతురు అపర్ణ.. అదే గ్రామానికి చెందిన అబ్బాస్‌ను ప్రేమించింది. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పది నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుని జనగాంలోని కుకునూర్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. మూడు నెలల క్రితం ఇద్దరి మధ్య మనస్పార్థలు రావడంతో తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరుకుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కూతురు తిరిగి పోవడంతో ఆగ్రహానికి గురై తల్లిదండ్రులు, బాబాయి ముగ్గురు కలిసి అబ్బాస్ ఇంటిపై దాడికి దిగారు. ఈ దాడిలో యువకుడి తల్లి సాహింబేగంకు తీవ్ర గాయాలై మృతి చెందింది. కుమారుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, గురువారం ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు, కర్ర స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. గజ్వేల్‌రూరల్ సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఉన్నారు.