బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Oct 10 2025 8:28 AM | Updated on Oct 10 2025 8:28 AM

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఒకరి పరిస్థితి విషమం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మెదక్‌ నుంచి వరంగల్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. హవేళిఘణాపూర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఔరంగాబాద్‌ గేటు వద్ద వరంగల్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వస్తున్న అవుసులపల్లికి చెందిన గొల్ల సిద్దయ్య కిందపడడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని మెదక్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement