
అల్గోల్‌లో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం
జహీరాబాద్ టౌన్: ఆచార్య డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 3 వలంటీర్లు మండలంలోని అల్గోల్ గ్రామంలో ప్రత్యేక శీతాకాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరికుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ నందుగౌడ్, యూనిట్ వన్ అధికారి దత్తు ఆధ్వర్యంలో వలంటీర్లు గ్రామంలో శ్రమదానం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి అక్షరాస్యత పెంపు, పిల్లలను పాఠశాలలో చేర్పించడం, మూఢనమ్మకాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రిన్సిపాల్ హరికుమార్ మాట్లాడుతూ...ఐదేళ్ల నుంచి అల్గోల్, పొట్‌పల్లి గ్రామాలను ఆచార్య కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు దత్తత తీసుకుని ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారని చెప్పారు.